ఈ గ్రహాలు మీపై ఆగ్రహించకూడదంటే.. స్టీల్ గ్లాస్‌లో నీళ్ళు తాగొద్దు!!

                                        జీవితంలో మనం ఉపయోగించే వస్తువులు కేవలం ఆరోగ్యంపైనే కాక.. జ్యోతిష్య గ్రహాలపైనా ప్రభావం చూపుతాయని అనేక మంది జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో తరచుగా వాడే స్టీల్ గ్లాసులో నీరు తాగడం కుండలిలోని మూడు కీలకమైన గ్రహాలను బలహీనపరుస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ పాత్రలో నీరు తాగుతామో.. దాని శక్తి మన శక్తిపై ప్రభావం చూపుతుంది. స్టీల్ గ్లాసును వాడినప్పుడు.. అది మన జాతకంలోని చంద్రుడు (Moon), శుక్రుడు (Venus), రాహువు (Rahu) అనే మూడు శక్తివంతమైన గ్రహాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.  స్టీల్ గ్లాసులో నీరు తాగడం సురక్షితమేనా.. ఏ 3 గ్రహాలపై తీవ్ర ప్రభావం చూపుతుందో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. 

3 గ్రహాలపై తీవ్ర ప్రభావం:

                                       నవగ్రహాలలో చంద్రుడు మనస్సు, మానసిక స్థిరత్వం, శాంతికి కారకుడు. చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు.. వ్యక్తి మనోస్థితిలో తరచుగా హెచ్చుతగ్గులు వస్తాయి. ఇది భావోద్వేగ అస్థిరత, ఆందోళన, అశాంతికి దారి తీస్తుంది. స్టీల్ గ్లాస్ వాడకం చంద్రుడి స్థానాన్ని బలహీనపరిచి.. మనసుకు అశాంతిని కలిగిస్తుంది. శుక్ర గ్రహం ప్రేమ, ఆకర్షణ, సౌందర్యం, ఆర్థిక సమృద్ధికి (Abundance) సంబంధించినది. జాతకంలో శుక్రుడు బలహీనమైతే.. అది వ్యక్తిగత సంబంధాలలో సమస్యలు, ఆకర్షణ లోపించడం, ఆర్థిక అసమతుల్యత వంటి సమస్యలకు కారణమవుతుంది. స్టీల్ గ్లాస్ వాడకం శుక్రుడిపై ప్రతికూల శక్తిని పెంచుతుంది.

                                        రాహువు అనేది భ్రమలు (Illusions), అకస్మాత్తుగా జరిగే సంఘటనలు, గందరగోళానికి సంబంధించిన ఛాయా గ్రహం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. స్టీల్ రాహువు యొక్క ప్రభావాన్ని పెంచే శక్తిని కలిగి ఉంటుంది. దీని వల్ల జీవితంలో అనవసరమైన గందరగోళం, అధిక పట్టుదల (Obsession), ఊహించని ఆరోగ్య సమస్యలు, కర్మ సంబంధిత కష్టాలు ఏర్పడతాయి. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం.. ఈ ప్రతికూల ప్రభావాల నుంచి రక్షించుకోవడానికి స్టీల్ గ్లాసు(steel glass) లకు బదులుగా వెండి (Silver) లేదా రాగి (Copper) పాత్రలలో నీరు తాగడం ఉత్తమం. వెండి, రాగి పాత్రలు చంద్రుడు, శుక్రుడికి బలాన్ని అందించి.. మనసుకు ప్రశాంతతను, ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతాయి. అదే సమయంలో ఇవి రాహువు ఛాయా శక్తిని సమతుల్యం చేయడానికి కూడా సహాయపడతాయి. ఈ జీవితంలో ఈ చిన్నపాటి మార్పులు చేసుకోవడం ద్వారా జ్యోతిష్యపరంగా పెద్ద ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *