అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోల భారీ ట్రేడ్ లైసెన్స్ ఎగవేత బయటపడింది – GHMC నోటీసులు జారీ

హైదరాబాద్ నగరంలో పేరెన్నికగన్న అన్నపూర్ణ స్టూడియోలు మరియు రామానాయుడు స్టూడియోలు భారీగా ట్రేడ్ లైసెన్స్ ఫీజులు ఎగ్గొట్టినట్టు GHMC తనికీల్లో బయటపడింది. సంవత్సరాల తరబడి వ్యాపార విస్తీర్ణాన్ని తక్కువగా చూపిస్తూ లక్షల్లో కట్టాల్సిన ఫీజులను కేవలం పదివేలు–పన్నెండు వేల రూపాయల వరకు మాత్రమే చెల్లించినట్లు అధికారులు గుర్తించారు.

GHMC స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా స్టూడియోల వివరాలు పరిశీలించడంతో నిజాలు వెలుగులోకి వచ్చాయి

అన్నపూర్ణ స్టూడియోస్ ఫీజు ఎగవేత

తనిఖీల్లో బయటపడ్డ వివరాలు:

  • స్టూడియో మొత్తం విస్తీర్ణం: 19,926 చదరపు అడుగులు
  • నమోదు చేసిన విస్తీర్ణం: కేవలం 8,172 చదరపు అడుగులు
  • అసలు కట్టాల్సిన వార్షిక ట్రేడ్ లైసెన్స్ ఫీజు: ₹11,52,396
  • ఇప్పటి వరకు కట్టింది: కేవలం ₹49,000

అధికారులు ఈ తేడాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, మిగిలిన మొత్తాన్ని తక్షణమే చెల్లించాలని నోటీసులు జారీ చేశారు.

రామానాయుడు స్టూడియోలు కూడా ఇదే తంతు

తనిఖీల్లో మరో షాకింగ్ అంశం బయటపడింది:

  • మొత్తం స్టూడియో విస్తీర్ణం: 68,276 చదరపు అడుగులు
  • నమోదు చేసిన విస్తీర్ణం: కేవలం 1,903 చదరపు అడుగులు
  • అసలు కట్టాల్సిన ఫీజు: ₹2.73 లక్షలు
  • చెల్లించినది: కేవలం ₹7,614

GHMC అధికారులు రివైజ్ చేసిన మొత్తాన్ని వెంటనే చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. రామానాయుడు స్టూడియోస్ నిర్వాహకులు నోటీసు వచ్చిన వెంటనే బకాయి మొత్తాన్ని చెల్లించినట్లు సమాచారం

సంవత్సరాలుగా కొనసాగుతున్న ఎగవేత – అధికారుల నిర్లక్ష్యమే కారణం?

ఈ రెండు ప్రముఖ స్టూడియోలు ఏళ్ల తరబడి:

  • తక్కువ విస్తీర్ణం చూపడం,
  • తక్కువ ఫీజు చెల్లించడం,
  • GHMC అధికారులు అదే మొత్తాన్ని స్వీకరించడం

వంటి అంశాలు స్పష్టంగా వెలుగులోకి వచ్చాయి.

ప్రజల్లో దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది:

“సాధారణ వ్యక్తి ఒక నెల టాక్స్ కట్టకపోయినా GHMC నోటీసులు, పెనాల్టీలు, దౌర్జన్యాలు చేస్తుంది…
అంత పెద్ద స్టూడియోలు లక్షల్లో ఎగ్గొడితే ఏళ్ల తరబడి నిద్రపోతారా?”

అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

కోట్ల రూపాయల నష్టం – ఇప్పుడు ఎవరు తిరిగి చెల్లిస్తారు?

GHMC యాక్ట్ ప్రకారం:

2 నెలలు టాక్స్ డిఫాల్ట్ అయినా
➤ 50% పెనాల్టీతో వసూలు చేయాలి

కేవలం 10 సంవత్సరాల లెక్క చూస్తేనే:

  • అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి కోటికి పైగా
  • రామానాయుడు స్టూడియోస్ నుంచి 20 లక్షలకు పైగా

ఫీజు రావాల్సి ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇప్పుడు ప్రశ్న:

ఈ సంవత్సరపు రివైజ్డ్ ఫీజు మాత్రమే వసూలు చేస్తారా?
లేదా గత సంవత్సరాల ఎగ్గొట్టిన మొత్తం కూడా వసూలు చేస్తారా?

GHMC డిప్యూటీ కమిషనర్ స్పందన:
“ప్రస్తుతం ఈ ఏడాది రివైజ్డ్ ఫీజును మాత్రమే వసూలు చేస్తాం. మిగతా దానిపై ఆలోచిస్తాం.”

ప్రజల ప్రశ్న – “సామాన్యుడైతే ఇంత వచ్చేదా?”

ప్రజలు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు:

  • చిన్న వ్యాపారి అయితే ఒక నెల టాక్స్ మిస్ అయినా GHMC కడుపు గోతిలోకి దూరుతుంది
  • కానీ కోట్ల రూపాయల వ్యాపారాలు చేసే స్టూడియోలు ఏళ్ల తరబడి ఫీజు ఎగ్గొడితే “నోటీసు ఇచ్చాం, చాలు” అన్నట్టుగా వదిలేస్తారా?
  • ఇది అధికారుల నిర్లక్ష్యమా?
  • లేదా ఇతర ప్రయోజనాలా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *