ప్రజలు, బీసీ కులాల సంఘాలు, ఓబిసి సమాజం ఈరోజు ప్రత్యేక దృష్టితో గమనిస్తున్నది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా లభించగా, ఉపరాష్ట్రపతిగా, మరియు సిపి రాధాకృష్ణ గారు వంటి నాయకులు బీసీ హక్కులను సమర్థంగా ముందుకు తీసుకువచ్చారు.
ద్రౌపది ముర్ము గారు ఎస్టీ నాయకురాలిగా అనేక పదవీలు రాజ్యాంగ హోదాలో పొందినట్లయితే, కులగణనలో కూడా భారతదేశంలో ప్రధానంగా 1931 తర్వాత ముందడుగు వేయబడినది. నరేంద్ర మోదీ గారి చర్యల వల్ల అసలైన బీసీల కులగణన మళ్ళీ ప్రారంభమవుతోంది.
కాంగ్రెస్ పార్టీ వంటి ప్రత్యర్థి పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ఘట్టాన్ని ప్రశ్నించినప్పటికీ, బీజేపీ బీసీల హక్కులు, కులగణన, మరియు రిజర్వేషన్ల పట్ల పూర్తి మద్దతు ప్రకటించింది. కాబట్టి, జేఏసి ద్వారా తీసుకున్న నిర్ణయాలను బీజేపీ కార్యకర్తలు, నేతలు పూర్తిగా సపోర్ట్ చేస్తారని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా, కార్యకర్తలు మరియు నేతలు రేపు జరగబోయే బందులో ప్రత్యక్షంగా పాల్గొని బీసీ హక్కుల కోసం ఒక ఐక్యప్రయత్నాన్ని చూపాలని పిలుపునిస్తున్నారు.

