జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో దొంగ ఓట్ల సిండికేట్‌? బక్కా జార్సన్ సంచలన వ్యాఖ్యలు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రోజురోజుకూ హాట్ టాపిక్ అవుతోంది. దొంగ ఓట్ల వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా వేడెక్కుతోంది. ఈ విషయంపై రాజకీయ విశ్లేషకుడు బక్కా జార్సన్ గారు ఓకే టీవీతో మాట్లాడారు.

జార్సన్ గారు మాట్లాడుతూ — “భోగస్ ఓట్లు అంటూ ఇప్పుడు బిఆర్ఎస్ ప్రచారం చేస్తోంది కానీ, ఈ ఓట్లు కొత్తవి కావు. ఇవి గత ప్రభుత్వ కాలంలోనే నమోదైనవి. ఎన్నికల కమిషన్ ముందుగా విచారణ చేసి నిజాలను బయట పెట్టాలి. ఇప్పుడు ఒక్కసారిగా ఎన్నికల సమయంలో ఈ అంశాన్ని రాజకీయ ఆయుధంగా వాడుకుంటున్నారు” అని అన్నారు.

అదే సమయంలో ఆయన “ఇది మొత్తం ఒక రాజకీయ సిండికేట్” అని సంచలనంగా వ్యాఖ్యానించారు. బక్కా జార్సన్ వ్యాఖ్యానించిన ప్రకారం — బిఆర్ఎస్, బిజెపి, టిడిపి, కాంగ్రెస్ నేతల మధ్య ఓ పరోక్ష అర్ధం కలిగిన సిండికేట్ ఏర్పడిందని, ఈ సిండికేట్ కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి కోసం పనిచేస్తోందని తెలిపారు.

జార్సన్ గారు తెలిపారు — “రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, కేటీఆర్ గారు ముగ్గురూ కలిసి ప్రజల దృష్టిని అసలు ప్రజా సమస్యల నుండి మళ్లించి దొంగ ఓట్లపై ఫోకస్ పెడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి హానికరం. నిజమైన ఎన్నికలు కావాలంటే ఎలక్షన్ కమిషన్ స్వయంగా విచారణ చేయాలి” అని అన్నారు.

అలాగే ఆయన పాత కేసులు, పాత రౌడీషీట్లు బయటకు తీస్తూ రాజకీయంగా వ్యక్తిత్వ దెబ్బతీయడమే బిఆర్ఎస్ ప్రణాళిక అని అన్నారు. “జూబ్లీహిల్స్ ప్రజలు నిజమైన అభివృద్ధి కోసం ఆలోచించి ఓటు వేయాలి” అని ఆయన పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *