జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కుతోంది. బిఆర్ఎస్ తరఫున మహిళా నాయకురాలు నిరోష గారు మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై ఓటు చోరీ ఆరోపణలు చేశారు. “దాదాపు 19,000 ఫేక్ ఓట్లు ఉన్నాయని మేము బూత్ లెవెల్ వరకు వెళ్లి సాక్ష్యాలు సేకరించాం. మేము ఇచ్చిన డేటా ఆధారంగా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి. ఫేర్ ఎలక్షన్ జరగాలి,” అని ఆమె అన్నారు.
నవీన్ యాదవ్‌కి క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉందని, ఆయనే గతంలోనూ ఫేక్ ఓట్లు వేయించారని ఆమె తీవ్ర స్థాయిలో విమర్శించారు. “ఆయన సొంత తమ్ముడి పేరుతో మూడు ఓట్లు ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చు,” అని నిరోష గారు అన్నారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ నేతలు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావుపై కూడా ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఒంటరి మహిళగా పోరాడుతున్న అభ్యర్థిపై వ్యక్తిగత విమర్శలు చేయడం కాంగ్రెస్ నేతల దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం” అని పేర్కొన్నారు.
ఆమె అభిప్రాయం ప్రకారం, జూబ్లీహిల్స్ ఎన్నిక బిఆర్ఎస్–కాంగ్రెస్ మధ్య పోటీ కాదు, ప్రజల భవిష్యత్తు కోసం జరిగే యుద్ధమని పేర్కొన్నారు. “జూబ్లీహిల్స్ ప్రజలు మళ్లీ బుల్డోజర్ రాజకీయం రాకుండా సునీత అమ్మని భారీ మెజారిటీతో గెలిపిస్తారు,” అని ఆమె ధైర్యంగా తెలిపారు.

