తెలంగాణలో కాంగ్రెస్ అలక: బీసీలకు న్యాయం, సంక్షేమ పాలనతో అఖండ విజయం లక్ష్యం

తెలంగాణలో రానున్న ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి పెరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న ప్రజా పాలనను రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు, గ్రామాభివృద్ధి అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులకు ప్రజల నుండి భారీ ఆదరణ లభిస్తోందని కాంగ్రెస్ నాయకులు ప్రకటించారు.

బీఆర్‌ఎస్ మరియు బీజేపీ పార్టీలు బీసీలపై అబద్ధపు ప్రచారం చేస్తూ ఉన్నప్పటికీ, తెలంగాణ ప్రజలు వారి మోసపూరిత రాజకీయాలను తిరస్కరించేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ అడ్డంకుల కారణంగానే 42% రిజర్వేషన్లు అమలు కాలేదని, అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ వారిని న్యాయంగా స్థానం కల్పించడానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

సంక్షేమ పథకాలు కాంగ్రెస్ కు ప్రధాన బలం
24 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ పథకాల కారణంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీపై అపార నమ్మకంతో ఉన్నారని, రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ రాబోతోందని నాయకులు ప్రకటించారు. మొత్తం 12,760 పంచాయతీల్లో కనీసం 10,000 కంటే ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ గెలవబోతుందని వారు ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్‌ఎస్, బీజేపీపై తీవ్ర విమర్శలు
బీఆర్‌ఎస్ పాలనలో అవినీతి, అన్యాయాలు జరిగినాయని, గత ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధి దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పెడలేదని కాంగ్రెస్ ఆరోపించింది. గ్రామ సర్పంచులకు నిధులు విడుదల చేయకపోవడం వల్ల జరిగిన ఆత్మహత్యలు బీఆర్‌ఎస్ పాలన యొక్క నల్ల చరిత్రగా పేర్కొన్నారు.

ముఖ్యంగా కేటీఆర్‌పై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తూ, పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు బీసీల కోసం కనీసంగా ఒక నిర్ణయం కూడా తీసుకోలేదని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం — సామాజిక న్యాయం
బీసీలకు, బడుగు బలహీనవర్గాలకు రాజకీయ, ఆర్ధిక, సామాజిక న్యాయం చేయడం మన బాధ్యత అని, రాబోయే ఎన్నికల ఫలితాలు తెలంగాణలో రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చనున్నాయని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *