ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒక నెల క్రితం తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనని బహిరంగంగా ప్రకటించిన దానం, తాజాగా మాత్రం “నేను ఇంకా బిఆర్ఎస్‌లోనే ఉన్నాను” అంటూ స్పీకర్‌కు అఫిడివిట్ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఇది సాధారణ యూ–టర్న్ కాదు… ఇది రాజీనామా భయంతో తీసుకున్న రాజకీయ వెనకడుగుగా కనిపిస్తోంది.
క్షేత్ర స్థాయిలో పరిస్థితులు దానంకు అనుకూలంగా లేవన్న ప్రచారం బలంగా ఉంది. ఒకవేళ రాజీనామా చేసి ఉపఎన్నిక ఎదుర్కొంటే గెలుస్తారా లేదా అన్న అనుమానమే ఆయన వెనకడుగు వేయడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. అందుకే స్పీకర్‌కు ఇచ్చిన అఫిడివిట్‌లో, కాంగ్రెస్ కార్యక్రమాలకు “వ్యక్తిగత హోదాలో” మాత్రమే హాజరయ్యానని, తాను బిఆర్ఎస్‌కు రాజీనామా చేయలేదని, పార్టీ తనను సస్పెండ్ కూడా చేయలేదని స్పష్టం చేశారు.
కానీ ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది.
బిఆర్ఎస్‌లోనే ఉన్నానని చెబుతున్న దానం నాగేంద్ర… మరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సికింద్రాబాద్ లోక్సభ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేశారు?
కానీ ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది.
బిఆర్ఎస్‌లోనే ఉన్నానని చెబుతున్న దానం నాగేంద్ర… మరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సికింద్రాబాద్ లోక్సభ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేశారు?
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి మీద కాంగ్రెస్ తరఫున ప్రచారం ఎందుకు చేశారు?
కాంగ్రెస్ ఫ్లెక్సులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి వేదికలు పంచుకున్నది నిజం కాదా?
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, “నేను బిఆర్ఎస్‌లోనే ఉన్నా” అని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం నెల రోజుల క్రితమే దానం నాగేంద్ర తన నియోజకవర్గంలో పర్యటిస్తూ తాను కాంగ్రెస్‌లో కొనసాగుతున్నానని ప్రకటించారు. ఇప్పుడు మాత్రం పూర్తి భిన్నమైన వాదన తెరపైకి తీసుకురావడం ఆయన రాజకీయ గందరగోళాన్ని స్పష్టంగా చూపిస్తోంది.
ఈ వ్యవహారం ఇంత తీవ్రంగా మారడానికి ప్రధాన కారణం—ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను త్వరగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు స్పీకర్‌ను ఆదేశించడం. ఇప్పటివరకు 10 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లలో ఏడింటిని స్పీకర్ కొట్టివేయగా, దానం నాగేంద్ర, కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్‌పై కేసులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేయాలని, పురోగతిపై అఫిడివిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు గడువు విధించడంతో దానం వ్యూహం మార్చుకున్నట్లు తెలుస్తోంది.

