దేశంలో తొలిసారి ఎన్నికల్లో డ్రోన్ల వినియోగం — జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో టెక్ సెక్యూరిటీ కొత్త అధ్యాయం

ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్
యూసుఫ్‌గూడలో ఓటు వేసిన నవీన్‌యాదవ్, కుటుంబసభ్యులు
తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్‌తో వచ్చి ఓటేసిన నవీన్ యాదవ్

కాంగ్రెస్‌పై బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి పలు ఆరోపణలు
BJYM కార్యకర్తలపై కాంగ్రెస్‌ నేతలు దాడికి దిగారు
ఎన్నికలకు ముందే దాడులు చేస్తున్నారు – దీపక్‌రెడ్డి
ఈవీఎంలో సీరియల్ నెంబర్‌ 1 సరిగ్గా లేదు
ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాం – దీపక్‌రెడ్డి

నాన్‌ లోకల్‌ నేతలపై ఎన్నికల సంఘం సీరియస్‌
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోలింగ్‌బూత్‌కు రావడంపై ఆగ్రహం
ఓటర్లను ప్రభావితం చేసేవిధంగా తిరుగుతున్నారన్న ఈసీ
ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్రనాయక్‌..
MLC శంకర్‌నాయక్‌పై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశం

జూబ్లీహిల్స్‌ బైపోల్‌లో ప్రలోభాలపర్వం..!
వెంగళరావునగర్‌, రెహమత్‌నగర్‌లో..
ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ వీడియోలు వైరల్‌
డబ్బులు పంచుతోంది మీరంటే మీరంటూ ఆరోపణలు
రెహమత్‌నగర్‌లో కాంగ్రెస్‌ నేతల్ని..
రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామంటున్న బీఆర్‌ఎస్‌ నేతలు
ఓటర్లకు బీఆర్ఎస్ నేతలు డబ్బులు ఇస్తున్నారంటూ కాంగ్రెస్ కౌంటర్

కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది -బొల్లం మల్లయ్య
విచ్చలవిడిగా డబ్బుల పంపిణీ జరుగుతుంది -బొల్లం మల్లయ్య
బీఆర్ఎస్‌కు ఓటెయ్యకుండా నోట్ల కట్టలతో కొంటున్నారు
డబ్బు పంపిణీ జరుగుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు
పోలీసులు కాంగ్రెస్‌కు ఒత్తాసు పలుకుతున్నారు -బొల్లం మల్లయ్య
ఎన్నికల సంఘం వెంటనే జోక్యం చేసుకోవాలి -బొల్లం మల్లయ్య

పోలింగ్‌పై జూబ్లీహిల్స్ ఓటర్ల నిరాసక్తత
జనం లేక వెలవెలబోతున్న పోలింగ్ కేంద్రాలు
ఓటేసేందుకు ఆసక్తి చూపని జూబ్లీహిల్స్ ఓటరు
ఎన్నికల సంఘం ఎంతగా అవగాహన పెంచినా కదలని ఓటరు
ఉదయం 11 గంటల వరకు 20.76 శాతం పోలింగ్ మాత్రమే నమోదు
బస్తీల్లో తప్ప మిగతా ప్రాంతాల్లో కదలని ఓటర్లు

కొత్త ఓటర్ల జోష్..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఫస్ట్ టైమ్ ఓటర్స్ తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి పోలింగ్ కేంద్రాల్లో ఓటేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నారు.

ఓటు హక్కు వినియోగించుకోండి – కర్ణన్
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ బూత్‌లను ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్.వి కర్ణన్ పరిశీలించారు. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని తెలిపారు. ప్రతీ ఓటర్ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కర్ణన్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *