గోవాలోని ప్రముఖ బీచ్ పాయింట్ రోమియో లేన్ నైట్‌క్లబ్‌లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 50 మందికి పైగా గాయాలు అయినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో నలుగురు విదేశీ పర్యాటకులున్నట్లు సమాచారం.
ప్రమాద సమయంలో క్లబ్లో డ్యాన్స్ షో జరుగుతుండగా, స్టేజ్‌పై ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ ఫైర్ క్రాకర్లు పేలడంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. కొద్ది సెకన్లలోనే అగ్ని క్లబ్ మొత్తం వ్యాపించడంతో బయటికి పరుగెత్తడానికి చాలా మందికి అవకాశం లేకపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
స్థలానికి వెంటనే చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు కృషి చేశారు. 23 మృతదేహాలను ఘటనాస్థలం నుంచే రికవరీ చేసినట్లు గోవా డీజీపీ అలోక్ కుమార్ తెలిపారు. మరికొందరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.
ప్రమాదంపై క్లబ్ మేనేజర్ సహా నలుగురు అరెస్ట్ చేయబడ్డారు. క్లబ్‌కు సరైన అగ్ని భద్రతా అనుమతులు లేవని, సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించారని పోలీసులు పేర్కొన్నారు.
ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేసి, బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
ఎంతో మంది పర్యాటకులు సరదాగా గడిపేందుకు వెళ్లిన చోట ఇలా పెద్ద ప్రమాదం జరగడంతో గోవా అంతటా తీవ్ర ఆవేదన నెలకొంది.

