జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సినీ హీరో గోపీచంద్ తన ఓటు హక్కును వినియోగించారు.
మహిళా సమాజం పోలింగ్ కేంద్రంలో ఆయన వచ్చి ఓటు వేసారు.
తర్వాత మీడియా ముందుకు వచ్చి తన సిరా గుర్తు చూపించారు.
ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సందేశం ఇచ్చారు.
“ఓటు మన హక్కు, మన భవిష్యత్తు నిర్ణయించే శక్తి. అందరూ తప్పనిసరిగా ఓటు వేయాలి” అని గోపీచంద్ అన్నారు.
పోలింగ్ కేంద్రం వద్ద ఆయనను చూసేందుకు అభిమానులు, ఓటర్లు పెద్ద ఎత్తున చేరారు.

