జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు పవన్ రెడ్డి గారు ఓకే టీవీతో మాట్లాడారు. ప్రస్తుతం మూడు పార్టీలు — కాంగ్రెస్, బిఆర్ఎస్, బీజేపీ — ప్రజాక్షేత్రంలో బలంగా పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
పవన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల తీర్పు బిఆర్ఎస్ వైపే వుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లో తీవ్ర అసహనాన్ని కలిగించాయని, జూబ్లీహిల్స్ అభివృద్ధి పేరుతో చివరి నిమిషంలో వాగ్దానాలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులపై ప్రజలు నమ్మకం కోల్పోయారని ఆయన విమర్శించారు.
ఇక మాగంటి సునీత అభ్యర్థిత్వం విషయంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. విష్ణువర్ధన్ రెడ్డి నామినేషన్ స్పేర్ అభ్యర్థిగా మాత్రమే దాఖలయ్యారని, సునీత గారే అధికారిక బిఆర్ఎస్ అభ్యర్థి అని చెప్పారు.
అలాగే బీసీ రిజర్వేషన్ 42% అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. చట్టపరమైన బలములేని బిల్లును అసెంబ్లీలో ఆమోదించడం ద్వారా కాంగ్రెస్ బీసీలను మభ్యపెట్టిందని వ్యాఖ్యానించారు.
ముగింపు గా పవన్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ ప్రజలు బిఆర్ఎస్ పట్ల ఉన్న విశ్వాసంతో మాగంటి సునీత గారిని విజయపథంలో నడిపిస్తారని నమ్మకం వ్యక్తం చేశారు.

