జూబిలీహిల్స్ ఉపఎన్నిక వేడి మొదలైపోయింది. ఇటీవల మృతిచెందిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ స్థానంలో జరుగుతున్న ఈ ఎన్నికపై తెలంగాణ అంతా దృష్టి సారించింది. ఇప్పటికే కాంగ్రెస్ – బిఆర్ఎస్ అభ్యర్థులు ప్రకటించుకోగా, బిజెపి అభ్యర్థి కూడా త్వరలో ఖరారు కావొచ్చని సమాచారం.
స్థానిక మోతీనగర్, బోరబండ, రెహమత్‌నగర్ ప్రాంతాల్లో ప్రజల అభిప్రాయాలు తీసుకుంటే స్పష్టమైన రాజకీయ అసంతృప్తి మరియు కన్ఫ్యూజన్ వాతావరణం కనిపిస్తోంది.
ప్రభుత్వంపై మిశ్రమ అభిప్రాయం
అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత కూడా పెద్దగా అభివృద్ధి కనిపించలేదని చాలా మంది ప్రజలు పేర్కొన్నారు.
- కరెంటు, రోడ్లు, డ్రైనేజ్, బస్తీ సమస్యలు అలాగే ఉన్నాయని
- పెన్షన్ ఆలస్యాలు పెరిగాయని
- కొన్ని సంక్షేమ పథకాల అమలులో ఆలస్యం ఉందని
చాలా మంది మాట్లాడుతూ,
“ప్రభుత్వం మారితే ఏదైనా మారుతుందని అనుకున్నాం.. కానీ ఏ మార్పు కనిపించలేదు”
అని స్పష్టం చేశారు.
పార్టీలపై ప్రజల స్పందన
- బిఆర్ఎస్ కార్మిక వర్గం మరియు బస్తీల్లో ఇంకా బలంగా కనిపిస్తోంది. “గోపీనాథ్ ఫ్యామిలీకి సీటు మళ్లీ రావచ్చు” అనే అభిప్రాయం బలంగా ఉంది.
- కాంగ్రెస్ అభిమానులు ఉన్నా, స్థానిక స్థాయిలో పనిచేయడంలో లోపాలు ఉన్నాయని కొందరు చెప్తున్నారు. “కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా కొత్తగా ఏదీ కనబడలేదు”
- బిజెపి కూడా ఈసారి చర్చలోకి వచ్చింది. ముఖ్యంగా యువత, హాస్టల్ విద్యార్థులలో మద్దతు కనిపిస్తోంది.చాలా మంది మాట్లాడుతూ,“ప్రభుత్వం మారితే ఏదైనా మారుతుందని అనుకున్నాం.. కానీ ఏ మార్పు కనిపించలేదు”అని స్పష్టం చేశారు.పార్టీలపై ప్రజల స్పందనబిఆర్ఎస్ కార్మిక వర్గం మరియు బస్తీల్లో ఇంకా బలంగా కనిపిస్తోంది.“గోపీనాథ్ ఫ్యామిలీకి సీటు మళ్లీ రావచ్చు” అనే అభిప్రాయం బలంగా ఉంది.కాంగ్రెస్ అభిమానులు ఉన్నా, స్థానిక స్థాయిలో పనిచేయడంలో లోపాలు ఉన్నాయని కొందరు చెప్తున్నారు.“కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా కొత్తగా ఏదీ కనబడలేదు”బిజెపి కూడా ఈసారి చర్చలోకి వచ్చింది. ముఖ్యంగా యువత, హాస్టల్ విద్యార్థులలో మద్దతు కనిపిస్తోంది.
- ఆటోడ్రైవర్లు, బస్తీ ప్రజల కష్టాలు
- ఆటోడ్రైవర్లు, చిన్న వ్యాపారులు ఫ్రీ బస్ సర్వీసులు, క్యాబ్ యాప్‌ల ప్రభావంతో ఆదాయం తగ్గిందని చెప్తున్నారు.
- కొన్ని బస్తీల్లో డ్రైనేజ్, రోడ్లు, నీటి సమస్యలు ఇంకా అదే స్థాయిలో ఉన్నాయని తెలిపారు.
- మొత్తానికి జూబిలీహిల్స్ ఓటరు అనిశ్చితిలో ఉన్నారు.
- అభివృద్ధి లేకపోవడం
- పార్టీల పని తీరు
- స్థానిక అభ్యర్థులపై నమ్మకం
- ఈ మూడు అంశాల చుట్టూ చర్చ సాగుతోంది.
- బిఆర్ఎస్ vs కాంగ్రెస్ vs బిజెపి
త్రికోణ పోరు ఆసక్తికరంగా మారింది.
ఎవరికి ప్రజలు పట్టం కడతారో నవంబర్ ఓట్లతో తేలనుంది.

