జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక వేడెక్కింది. ప్రాంతాల వారీగా చూస్తే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. బీజేపీ ప్రాతినిధ్యం తక్కువగా కనిపిస్తున్నప్పటికీ, కొంతమంది పట్టణ ఓటర్లలో ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఎర్రగడ్డ, రహమత్‌నగర్ వంటి ప్రాంతాల్లో బీఆర్‌ఎస్ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. రహమత్‌నగర్‌లో బీఆర్‌ఎస్ 48%, కాంగ్రెస్ 44%, బీజేపీ 6% శాతం వరకు ఉంది. అదే సమయంలో బోరబండ, శేక్‌పేట్ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఆధిక్యం ఉంది — బోరబండలో కాంగ్రెస్ 47%, బీఆర్‌ఎస్ 43%, బీజేపీ 7.5% గా నమోదైంది.
శ్రీనగర్ కాలనీ, వెంగళ్‌రావ్‌నగర్, ఎర్రగడ్డ వంటి ప్రాంతాల్లో మాత్రం బీఆర్‌ఎస్ ఆధిపత్యం కొనసాగుతోంది. మొత్తం మీద రెండు పార్టీల మధ్య 3–5% తేడా మాత్రమే ఉండటంతో, ఎవరు గెలుస్తారో అంచనా వేయడం కష్టం అవుతోంది
నిపుణుల అభిప్రాయం ప్రకారం, మైనారిటీ ఓట్లు, చివరి నిమిషం ప్రచార ప్రభావం, పోలింగ్ డే టర్నౌట్ — ఇవే ఫలితాన్ని నిర్ణయించగలవు. రిగ్గింగ్, దొంగ ఓట్లు వంటి ఆరోపణల నేపథ్యంలో కౌంటింగ్ ఫలితాలు మరింత ఆసక్తికరంగా మారబోతున్నాయి.
పబ్లిక్ మూడ్‌లో తేడా తక్కువగా ఉన్నందున, చివరి గంటల్లో జరిగిన పరిణామాలు ఫలితాన్ని తారుమారు చేసే అవకాశం ఉంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్–బీఆర్‌ఎస్ పోరు హాట్‌గా మారుతుండగా, బీజేపీ ప్రాధాన్యం మాత్రం తక్కువగా కనిపిస్తోంది.
చివరి క్షణం వరకు ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టమే అయినా, జూబ్లీ హిల్స్ ప్రజల తీర్పు రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి

