తెలంగాణ రాజకీయాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో, మాజీ మంత్రి కొండా సురేఖ కుమార్తె మరో సెన్సేషన్ వ్యాఖ్యలు చేశారు. ఆమె లైవ్ లో మాట్లాడుతూ, “మన మీద కుట్రలు జరుగుతున్నాయి, వేమ నరేంద్ర రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరి, బసవరాజ్ సారయ్య, గుండుసుతారా వంటి నేతలు ఈ కుట్రల్లో భాగస్వామ్యులుగా ఉన్నారు” అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆమె ఇంకా చెప్పినదేమిటంటే — “ఇప్పుడు నా చుట్టూ మొత్తం పోలీసులు ఉన్నారు. ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను, అమ్మా నాన్న ఎవరూ లేరు. ఎలాంటి తప్పు చేయకపోయినా పోలీసుల ప్రహారిలో ఉన్నాను. బీసీ నాయకురాలినే టార్గెట్ చేస్తున్నారు” అని వ్యాఖ్యానించారు.
కొండా కుటుంబం పట్ల జరుగుతున్న ఈ పరిణామాలను ఆమె “రాజకీయ కుతంత్రాలు”గా పేర్కొంటూ, “మేము ఫైటర్లు. చిన్నప్పటి నుంచి ఫైట్ చేస్తూ వచ్చాం. ఎవరు ఎన్ని పోలీసులు పెట్టినా భయపడను. ఎవరైనా నన్ను తీసుకుపోతే ప్రజలు తీవ్రంగా ఖండించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
ఆమె చేసిన ఈ లైవ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొండా కుటుంబం పట్ల జరుగుతున్న రాజకీయ ఒత్తిళ్లపై విస్తృత చర్చ సాగుతోంది.

