జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: కేటీఆర్ ఆగ్రహం – నవీన్ యాదవ్ పై ఆరోపణలు, అభివృద్ధి చర్చే ముఖ్యమని ప్రతిపక్ష కౌంటర్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కుతున్న నేపథ్యంలో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ షేక్‌పేట్‌లో రోడ్‌షో నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను లక్ష్యంగా చేసుకుని, కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నవీన్ యాదవ్‌ను “ఆకు రౌడీ”గా వ్యవహరిస్తూ, ప్రజలు పొరపాటున గెలిపిస్తే అతను అందరినీ బెదిరించే అవకాశం ఉందని హెచ్చరించారు.

కేటీఆర్ ఆరోపణల ప్రకారం, కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో రాష్ట్రానికి మేలు చేయలేకపోయిందని, ఇచ్చిన హామీలు అమలు కాలేదని చెప్పారు. పేదల ఇళ్లను కూల్చిన “బుల్డోజర్ ప్రభుత్వం”కు ఓటు వేయవద్దని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను విజేతగా నిలపాలని కోరారు.

కేటీఆర్ వ్యాఖ్యలపై ప్రతిస్పందించిన విశ్లేషకులు మరియు ప్రతిపక్ష వర్గాలు, ప్రచారంలో పర్సనల్ టార్గెటింగ్ కంటే అభివృద్ధి చర్చే ప్రధానంగా ఉండాలని వ్యాఖ్యానిస్తున్నారు. “ఒక నాయకుడు రౌడీయా కాదా అనే నిర్ణయం ప్రజలదే. అభ్యర్థి గెలిస్తే ఏ అభివృద్ధి చేస్తారు? గతంలో ఏం చేశారు? ఇవే ప్రజలు వినాలనుకుంటున్నారు,” అని అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *