ఫిబ్రవరి 12న మున్సిపల్ ఎన్నికలు వద్దు: ఎన్నికల సంఘానికి కార్మిక సంఘాల వినతిఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనర్ అనర్హుడంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలు

రాష్ట్రంలో ఫిబ్రవరి 12న మున్సిపల్ ఎన్నికలు నిర్వహించవద్దని పలు కార్మిక సంఘాలు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరాయి. నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా, విద్యుత్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, పాత ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, జాతీయ విత్తన బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అదే రోజున దేశవ్యాప్తంగా కార్మికులు సర్వసాధారణ సమ్మెకు పిలుపునిచ్చినట్లు సంఘాల నాయకులు తెలిపారు.

ఫిబ్రవరి 12న మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారాలు మీడియాలో వస్తుండటంతో, వాటిని రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లినట్లు కార్మిక సంఘాలు వెల్లడించాయి. శుక్రవారం మాసబ్‌ట్యాంక్‌లోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని కలసి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ, బీఆర్టీయూ, టీయూసీఐ, ఐఎఫ్‌టీయూ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఇదిలా ఉండగా, ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చీఫ్‌గా ఉన్న హైదరాబాద్ సీపీ సజ్జనర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సజ్జనర్‌కు సిట్‌ను నడిపించే నైతిక అర్హత లేదని ఆయన వ్యాఖ్యానించారు.

2015లో ఓటుకు నోటు కేసు సమయంలో సజ్జనర్ ఇంటెలిజెన్స్ విభాగంలో కీలక పదవిలో ఉన్నారని, అప్పట్లో జరిగిన పరిణామాలపై ఆయన్ను ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. అంతేకాదు, సజ్జనర్‌తో పాటు అప్పటి ఇతర ఇంటెలిజెన్స్ అధికారులపై ఆంధ్రప్రదేశ్‌లోని పలు పోలీస్ స్టేషన్లలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు.

ఈ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా సిట్ చీఫ్, హైదరాబాద్ సీపీ సజ్జనర్ శుక్రవారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు నోటీసులు జారీ చేశారు. తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని పేర్కొంటూ, ఏడు క్రిమినల్ కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు, క్రైమ్ నంబర్లు, పోలీస్ స్టేషన్ వివరాలను రెండు రోజుల్లోగా అందించాలని నోటీసుల్లో డిమాండ్ చేశారు. ఆధారాలు సమర్పించకపోతే పరువు నష్టం, క్రిమినల్ బెదిరింపుల కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ పరిణామాలతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వేడి పెరిగింది. ఒకవైపు మున్సిపల్ ఎన్నికల తేదీపై కార్మిక సంఘాల డిమాండ్లు, మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు చుట్టూ ఆరోపణలు–ప్రత్యారోపణలతో తెలంగాణ రాజకీయ వాతావరణం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *