నిజామాబాద్ లోని మాధవనగర్ ఫ్లైఓవర్ పనులకు సంబంధించి నిధుల విడుదల ఆలస్యమవుతున్నందుకు అసంతృప్తి వ్యక్తం చేశారు స్థానిక ప్రజా ప్రతినిధులు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తన వాటా మొత్తాన్ని జమ చేసిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బిల్లులు పెండింగ్‌లో ఉంచి కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయడం లేదని ఆరోపించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ – “మాధవనగర్ ఫ్లైఓవర్ మొత్తం వ్యయం 55 కోట్ల రూపాయలు. ఇందులో సగం కేంద్రం, సగం రాష్ట్రం ఇవ్వాలి. ఇప్పటికే 34.29 కోట్లు రిసీవ్ అయ్యాయి, కానీ 3.15 కోట్లు బిల్లులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి” అని తెలిపారు.
అదేవిధంగా అడవి మామిడిపల్లి మరియు అరసపల్లి బ్రిడ్జ్‌ల పనులు కూడా ఫండ్స్ లోపం వల్ల నిలిచిపోయాయని పేర్కొన్నారు. “కాంట్రాక్టర్లు బిల్లులు 2024 డిసెంబర్లో రైజ్ చేశారు. తొమ్మిది నెలలు అయినా పేమెంట్లు జరగలేదు” అని ఆవేదన వ్యక్తం చేశారు.
రైల్వే కేబుల్స్ తొలగించేందుకు 63 లక్షలు డిపాజిట్ చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఆ మొత్తం ఇప్పటివరకు విడుదల కాలేదని ఆయన అన్నారు.
“మేము బిల్లు రైజ్ చేయడాన్ని ఆపొద్దు. ప్రభుత్వంలో డబ్బులు లేకపోయినా మీరు పనులు పూర్తి చేయాలి. పేమెంట్లు రిలీజ్ కాకపోతే మాధవనగర్ ఫ్లైఓవర్ కోసం నిరాహార దీక్షకు కూర్చుంటాను,” అని హెచ్చరించారు.

