అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఉదయం అకస్మాత్తుగా టెన్షన్ వాతావరణం నెలకొంది. మావోయిస్టులు–భద్రతా దళాల మధ్య చోటుచేసుకున్న భారీ ఎన్‌కౌంటర్‌లో పలు అగ్రనేతలు మృతి చెందినట్లు సమాచారం. ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ప్రారంభమైన ఈ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఫైర్ ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
ప్రాథమిక సమాచార ప్రకారం, ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందగా, వారిలో అత్యంత కీలక నాయకుడు హిడ్మా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అధికారిక ధృవీకరణ అయితే ఇంకా రావాల్సి ఉంది.
స్థానిక అడవుల్లో మావోయిస్టు అగ్రనేతలు తలదాచుకున్నారన్న విశ్వసనీయ సమాచారం రావడంతో, పోలీసులు మరియు భద్రతా బలగాలు భారీ ఎత్తున కూబింగ్ చేపట్టారు. ఇదే సమయంలో మావోయిస్టుల నుంచి కాల్పులు జరగడంతో తీవ్ర ఎన్‌కౌంటర్‌కు దారి తీసింది.
ఈ దాడిలో హిడ్మా భార్య సహా ఆరుగురు నక్సలైట్లు మృతిచెందినట్లు తెలుస్తోంది.
హిడ్మా ఎవరు?
మావోయిస్టు పార్టీలో అత్యంత ప్రమాదకరమైన నేతల్లో హిడ్మా ముందున్న పేరు.
- అసలు పేరు: విలాస్ (అka హిడ్మాల్ / సంతోష్)
- ప్రాంతం: చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా
- వయసు: 50 ఏళ్లు పైనే
- భాషలు: హిందీ, గోండి, తెలుగు, కోయ, బెంగాలీ
- రివార్డ్:
- హిడ్మాపై: ₹1 కోటి
- అతని భార్యపై: ₹50 లక్షలు
- దండకారణ్యంలో మావోయిస్టు గెరిల్లా వార్‌ఫేర్ స్ట్రాటజీల రూపకల్పనలో హిడ్మా కీలక వ్యక్తి. 2017లో 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లపై చేసిన దాడి సహా అనేక దాడుల్లో అతను కీలక పాత్ర పోషించాడు. తన గెరిల్లా స్కిల్, అడవి పరిజ్ఞానం, వేగవంతమైన దాడి సాంకేతికతలతో హిడ్మా మావోయిస్టు ఉద్యమంలో అత్యంత ప్రభావశీల నాయకుడిగా పేరొందాడు.
- ఆపరేషన్ కగార్ ప్రభావం
- ఇటీవలి కాలంలో ఆపరేషన్ కగార్ ఆగ్రహం పెరగడంతో, హిడ్మా టీమ్ చత్తీస్‌గఢ్ నుంచి మారేడుమిల్లి ప్రాంతానికి తరలివచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భద్రతా దళాల దాడులు ముమ్మరమయ్యాయి
- ఇప్పటి వరకు వస్తున్న సమాచారంతో హిడ్మా హతమయ్యాడనే వార్త భద్రతా వ్యవస్థలకు పెద్ద విజయంగా భావించబడుతోంది. అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

