తెలంగాణలో రియల్ ఎస్టేట్ ధరలు మరింతగా పెరుగుతున్న వేళ, నియో పోలీస్ లేఅవుట్‌లో జరిగిన తాజా వేలం రికార్డు స్థాయి మొత్తాలను నమోదు చేసింది.
ఎకరానికి ₹151.25 కోట్ల ధర పలికిన ఈ వేలంలో, మరో ప్లాట్ ఎకరానికి ₹147.75 కోట్లకు అమ్ముడైంది. మొత్తం నాలుగు ప్లాట్ల వేలం ద్వారా హెచ్ఎండీఏకు ₹2708 కోట్లు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
- 15వ ప్లాట్: 4.5 ఎకరాలు — కొనుగోలు దారు JHR
- 16వ ప్లాట్: 3 ఎకరాలు — కొనుగోలు దారు గోదరేజ్ గ్రూప్
డిసెంబర్‌లో మరిన్ని రెండు ప్లాట్లను వేలం వేయనున్నట్లు సమాచారం.
అయితే, ఈ భారీ ధరలు ప్రజల్లో ఆందోళనను పెంచాయి. ఈ ధరలు మార్కెట్ విలువను కృత్రిమంగా పెంచి సాధారణ ప్రజలకు భూమి దూరమవుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎకరానికి ₹150 కోట్లు ధర ఉంటే, సామాన్యులు చిన్నపాటి కొన్ని వందల గజాల ప్లాట్ కూడా కొనలేని పరిస్థితి ఏర్పడిందని విమర్శకులు అంటున్నారు.
Political Reaction:
ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై తీవ్ర ప్రశ్నలు లేవెత్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన ఈ భూ వేలాల ద్వారా వచ్చిన ₹2708 కోట్ల ఆదాయం ప్రజల కోసం వినియోగం అవుతుందా? అన్న ప్రశ్న ప్రధాన చర్చగా మారింది.
విమర్శకులు అడుగుతున్న ప్రశ్నలు:
- అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీత బకాయిలకు ఈ నిధులు వినియోగిస్తారా?
- స్టాఫ్ నర్సుల వేతన సమస్య పరిష్కారం అవుతుందా?
- రిటైర్ అయిన ఉపాధ్యాయులు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న పెన్షన్ ఇస్తారా?
- నిరుద్యోగ భృతి అమలు చేస్తారా?
వీటికి ప్రభుత్వం నుండి ఇంకా స్పష్టమైన సమాధానం రాలేదు.

