ఓబీసీ రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ అడ్డంకులు — రేవంత్ రెడ్డి కృషిని ప్రశంసించిన కాంగ్రెస్ నేతలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు బిల్లు ఆమోదించింది. అయితే, ఆ బిల్లును భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అడ్డుపడుతున్నదని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విమర్శించారు.

రేవంత్ రెడ్డి గారు బిల్లును పాస్ చేయడమే కాకుండా, అఖిల పక్షాన్ని తీసుకొని ప్రధానమంత్రి మోదీ గారిని కలుసుకుందామని, పార్లమెంట్‌లో నైన్త్ షెడ్యూల్‌లో చేర్చాలన్న ప్రయత్నం చేసినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం సమయం ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో, హైదరాబాద్ నుండి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ రాష్ట్ర ఓబీసీ సంఘాలు భారీ స్థాయిలో ధర్నా నిర్వహించాయి. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పార్టీ నేతలు ఈ ధర్నాకు మద్దతు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ హైకోర్టు మరియు సుప్రీం కోర్టుల్లో సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింగ్ సింగ్‌వీ, రవివర్మ, డీఎన్ రావు వంటి ప్రముఖులను నియమించి బిల్లు అమలుకు న్యాయపరంగా పోరాడుతోందని తెలిపారు.

అయినా కూడా కేంద్ర ప్రభుత్వం బిల్లును నైన్త్ షెడ్యూల్‌లో చేర్చకపోవడం, రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించకపోవడం వల్ల, సుప్రీం కోర్టు రిజర్వేషన్ పై ప్రశ్నలు లేవనెత్తిన పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.


ఓబీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే బిల్లుపై కేంద్ర బీజేపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం న్యాయపరంగా పోరాడుతూనే, అన్ని రాజకీయ పార్టీలను కలిపి ప్రధానమంత్రిని కలవాలని ప్రయత్నించినప్పటికీ, కేంద్రం స్పందించకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *