హైదరాబాద్‌లో జరిగిన ఆర్‌పిఐ పార్టీ సమావేశంలో అంబేద్కర్ గారి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గాలి వినోద్ కుమార్ ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి నియామకాలపై తీవ్రంగా స్పందించారు.
అయన మాట్లాడుతూ — “రాజ్యాంగబద్ధమైన అవకాశాలను పక్కనబెట్టి రేవంత్ రెడ్డి తన వర్గానికి 72% పదవులు కేటాయించటం అన్యాయం. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధం. ఈ విధానాన్ని అడ్డుకోవడమే ప్రజాస్వామ్య రక్షణ” అని అన్నారు.
గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ “ప్రొఫెసర్ హరగోపాల్, కోదం రామరెడ్డి లాంటి నేతలు అన్యాయానికి వ్యతిరేకంగా న్యాయపోరాటం ప్రారంభించాలి. ఒకవేళ అన్యాయం జరిగితే, ఉద్యమం కూడా చేయాలి. అవసరమైతే సుప్రీం కోర్టు వరకు వెళ్ళడానికి నేను సిద్ధం” అని చెప్పారు.
అయన హైకోర్టు న్యాయవాదిగా ఉన్న తాను ఉద్యమానికి చట్టపరమైన మద్దతు ఇవ్వడానికి సిద్ధమని తెలిపారు. అంతేకాకుండా తెలంగాణ ఏర్పాటుకు కృషి చేసిన వారిని మర్చిపోరాదని, వాళ్లకు సాయం చేయని వారు కూడా ఇప్పుడు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

