దావోస్ ఫోటోలు… ఖర్చుల బిల్లులు తప్ప పెట్టుబడులు ఎక్కడ రేవంత్ అన్న?

ప్రజా సమస్యలకన్నా ఫోటోలు, ఫ్లైట్లు ముఖ్యం అయితే దావోస్ ఎందుకు?

గతంలో రేవంత్ రెడ్డి గారు ఇతరులపై మాట్లాడిన మాటలే ఇప్పుడు ఆయన్నే ప్రశ్నిస్తున్నాయి. ఒకప్పుడు “హిమాంశని వేసుకొని తిరుగుతున్నాడు” అంటూ విమర్శించిన రేవంత్ రెడ్డి, ఈరోజు ముఖ్యమంత్రిగా తన మనవడిని ఎక్కించుకొని మురిసిపోతూ కనిపిస్తున్నారు. వ్యక్తిగతంగా పిల్లల్ని ప్రేమించడం తప్పు కాదు. కానీ అదే వ్యక్తి గతంలో మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటే ప్రశ్నలు రావడం సహజం.

ప్రతి కార్యక్రమానికి అమ్మవారి బ్లెస్సింగ్స్ పేరుతో మనవడిని తీసుకెళ్తే సరే అనుకుందాం. కానీ ఇవాళ క్యాబినెట్ సమావేశానికి ఎంతమంది మంత్రులు హాజరయ్యారు? పరిపాలనకు ప్రాధాన్యం ఎక్కడ? రాజసం చూపించడమేనా ముఖ్యమంత్రిత్వం?

మేడారంలో తులాభారం, దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఐటీ–లైఫ్ సైన్సెస్, విజన్ డాక్యుమెంట్లు — వినడానికి బాగున్నాయి. కానీ ప్లీజ్ రేవంత్ అన్న… మొన్న గ్లోబల్ సమ్మిట్ ఎటకెక్కింది కదా. లాస్ట్ టైం కూడా దావోస్‌కి వెళ్లి “80 వేల కోట్లు పెట్టుబడులు” అన్నారు. కోట్లు కాదు కదా… ఒక్క బూట్ల కంపెనీ కూడా రాలేదు. ఇది నిజం కాదా?

అప్పుడు శ్రీధర్ బాబు ఉన్నాడు. ఇప్పుడు మళ్లీ దావోస్. అప్పట్లో శంకుస్థాపనలు జరిగాయి. ఈరోజు చెట్ల కింద, పూటల కింద ఆ శంకుస్థాపన రాళ్లు కనిపిస్తున్నాయి. మరి కంపెనీలు ఎక్కడ? ఉన్నాయా? లేవా? ఆ విషయం శ్రీధర్ బాబుకి కూడా తెలీదు. ఎందుకంటే ఈ అడ్మినిస్ట్రేషన్ ఐటీ కన్నా వేరే “గాయలు” చూసుకుంటుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

నిమిషానికి “రైజింగ్”, “జింగ్ జింగ్” అంటారు. ఐదు లక్షల కోట్లు అంటారు. ఇండస్ట్రియల్ ఏరియాలు మార్చేస్తాం అంటారు. చివరకు దావోస్ పారిపోతారు. అక్కడ ఫోటోలు దిగుతారు. అంతే.
ఫ్లైట్ చార్జీలు — వేస్ట్
ఫుడ్ చార్జీలు — వేస్ట్
అకమొడేషన్ చార్జీలు — వేస్ట్

నీతో పాటు ముఖ్యమంత్రి సలహాదారులు, మంత్రులు, అధికారులు — ఫోటోలు నీకు, పోట్లు వాళ్లకు. తెలంగాణ ప్రజలకు మిగిలేది ఏమిటి?

ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లు “భారీ పెట్టుబడ్ల సమీకరణ లక్ష్యంగా” అని రాస్తాయి. ఎందుకంటే 100 ఎకరాలు ఇచ్చాక ఎవడైనా రాస్తాడు. కానీ ప్రశ్న ఇదే —
ఎన్ని కంపెనీలు వచ్చాయి?
ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి?
80 వేల కోట్లు కాదు… కనీసం కోటి రూపాయి పెట్టుబడి చూపించగలరా?

భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి — మీ ముగ్గురినీ అడుగుతున్నా. దావోస్‌కి వెళ్లి వచ్చిన ఖర్చుల బిల్లులు తప్ప ఇంకేముంది చేతిలో?

మీకు అనుకూలంగా ఉన్న కొంతమంది బ్యూరో చీఫ్‌లను, శాటిలైట్ మీడియాను వాడుకొని డప్పులు కొట్టవచ్చు. కానీ నిజం తెలంగాణ ప్రజలకు తెలుసు. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రపంచం మొత్తం సూట్ వేయాలి అన్న అహంకారం సరిపోదు.

లాస్ట్ టైం లండన్ బోటులో అద్దాలు పెట్టుకొని ఫోటోలు దిగారు. బ్యూటీ ఆఫ్ లండన్ చూసి వచ్చారు. ఇంతకుమించి ఏమైంది?

కావాలంటే తెలంగాణ ప్రజల్ని అడగండి. కావాలంటే నాపై ఇంకో 10–15 కేసులు పెట్టండి. నాకు భయం లేదు. ఈ మధ్య కేసులు పెట్టుకున్నోడే మహారాజు అంట. అలా అయితే నన్ను అరెస్ట్ చేస్తే నేనూ ముఖ్యమంత్రి అయిపోతానేమో!

ప్లీజ్ రేవంత్ అన్న…
డప్పులు కొట్టడం మానేసి
ఫోటోలు దిగడం మానేసి
ప్రజలకు ఏం చేశారో చెప్పండి.

అదే కావాలి తెలంగాణకు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *