తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఫుట్‌బాల్ షో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న ఫుట్‌బాల్ కార్యక్రమం చుట్టూ భారీగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఆడలేని వ్యక్తి ఆడుతున్నట్టు బిల్డప్ ఇవ్వడం, పక్కన టీమ్ బాల్ తీసుకొచ్చి ఇస్తే ఒకచోట నిలబడి తన్నడం తప్ప నిజమైన ఆట లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ ఫుట్‌బాల్ ఈవెంట్‌కు సంబంధించి సుమారు 200 కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు అయిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఖర్చుపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫోటోలు, బిల్డప్లు, ప్రత్యేక టీషర్ట్లు, కుటుంబ సభ్యుల హడావుడి చూస్తే ఇది ప్రజల కోసం చేసిన కార్యక్రమమా? లేక కొందరి కుటుంబాల ప్రచారమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మరోవైపు, కొందరు నేతల పిల్లలకు, బంధువులకు అంతర్జాతీయ స్థాయి ఫుట్‌బాల్ ప్రైజులు ఇప్పించడంపై కూడా తీవ్ర విమర్శలు ఉన్నాయి. “ఏం సాధించారని ఇలాంటి ప్రైజులు?” అని ప్రశ్నిస్తూ, ఇది తెలంగాణ ప్రజల శ్రమతో వచ్చిన డబ్బుతో జరిగిన ఆర్భాటమేనని ఆరోపణలు చేస్తున్నారు.
ఇదే సమయంలో హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న గురుకుల పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చేరిన ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. విద్యాశాఖ మంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ఇటువంటి కీలక సమస్యలను పక్కన పెట్టి ఫుట్‌బాల్ ప్రచారంలో మునిగిపోవడం సరైందా అనే ప్రశ్న ప్రజల్లో వినిపిస్తోంది.
మొత్తంగా చూస్తే, ఒకవైపు విద్యార్థులు, ప్రజాసమస్యలు; మరోవైపు కోట్ల రూపాయల ఖర్చుతో ఫుట్‌బాల్ షోలు—ఇది నిజంగా “రైజింగ్ తెలంగాణ”నా? లేక బిల్డప్ల తెలంగాణనా? అన్న చర్చ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

