తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్, అలాగే ప్రపంచ ప్రసిద్ధ ఫుట్‌బాల్ జట్టుతో ఆడడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక సమ్మిట్‌పై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సరదా, పెద్ద చర్చ మొదలైంది.
“ముఖ్యమంత్రి ఎన్ని సార్లు ఢిల్లీకి వెళ్లారా?” అన్న ప్రశ్న కంటే ఇప్పుడు ప్రజల్లో ఎక్కువ డిస్కషన్ అవుతున్నది —
“ఈ ఫుట్‌బాల్ షో ఆఫ్‌కు ఎంత ఖర్చు పెట్టారు?”
సీఎం రేవంత్ రెడ్డి చిన్నప్పటి నుంచి ఫుట్‌బాల్ ఆడతారట, ఆడటం మంచిదే. కానీ ఇప్పుడు టెలంగాణ ప్రజల డబ్బుతో విదేశీ జట్టును పిలిచి, ఇది గ్లోబల్ సమ్మిట్ అంటూ ఖర్చులు చేయడం ఎందుకు? అనే ప్రశ్న పెద్దదైందని విమర్శకులు అంటున్నారు.
ఒక వేళ ఈ సమ్మిట్‌కు అయ్యే కోట్ల రూపాయలు తెలంగాణ గురుకులాల పిల్లలకు స్పోర్ట్స్ షూస్, డ్రెస్‌లు, ఫుడ్, ట్రైనింగ్ కోసం ఖర్చు చేసి ఉంటే — నూరు మంది గెలిచే ఆటగాళ్లు, ఒలింపిక్స్‌లో మెడల్స్ తెచ్చేవాళ్లు తయారయ్యేవారు”
అంటూ ప్రజలు సోషల్ మీడియాలో రాస్తున్నారు.
మరోవైపు ప్రజల్లో వినిపిస్తున్న వాదన ఏమిటంటే—
సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఇలాంటి ఫుట్‌బాల్ కార్యక్రమాల్లో పాల్గొనలేదు.
మరి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎందుకు?
అదే ప్రోమోషన్ కోసమా?
ప్రజల పైన షో ఆఫ్ కోసమా?
ఇంతలోనే మరో వివాదం కూడా తెరమీదకు వచ్చింది.
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు వికార్బాద్లో 300 కోట్ల విలువైన భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించాడని, 70 మంది బౌన్సర్లతో దాడి జరిగిందని, కేసులు నమోదయ్యాయనే సమాచారం బయటకు వచ్చింది.
అంతేకాదు —
కస్టమ్స్ స్మగ్లింగ్ కేసులు, 600 కోట్ల నగదు సీజ్, రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లు — ఇలా వరుస ఆరోపణలు సోషల్ మీడియాలో మళ్లీ మళ్లీ ట్రెండ్ అవుతున్నాయి.
ప్రజల్లో ప్రశ్న ఇప్పుడు ఒక్కటే:
“ప్రాజెక్టులు, ఉద్యోగాలు, రిజర్వేషన్లు, రైతుల సమస్యలు మాట్లాడకుండా — ఎందుకు విదేశీ జట్టు, ఫుట్‌బాల్, ప్రదర్శనలు? ఇది తెలంగాణ కోరుకున్న ప్రభుత్వం?”
సోషల్ మీడియాలో ఇప్పటికే పోల్స్, కమెంట్స్ దుమ్మురేపుతున్నాయి:
- A) సీఎంను ఫుట్‌బాల్ ఆడాలని ప్రజలు కోరుకున్నారా?
- B) ప్రజల సంక్షేమం, అభివృద్ధే ముఖ్యమా?
ఈ ఖర్చులపై ప్రభుత్వం స్పందిస్తుందా?
తెలంగాణ ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో — అది త్వరలోనే స్పష్టమవుతుంది.

