మెట్రో స్టేషన్లలో ట్రాన్స్‌జెండర్ సిబ్బంది: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం ప్రశంసనీయం

ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఇటీవల తీసుకున్న నిర్ణయం ప్రకారం, హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో ట్రాన్స్‌జెండర్ సిబ్బందిని నియమిస్తూ కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించింది.

ఈ కార్యక్రమంలో భాగంగా శిక్షణ పూర్తి చేసుకున్న 20 మంది ట్రాన్స్‌జెండర్లు సోమవారం అధికారికంగా విధుల్లో చేరారు. వీరు మెట్రో స్టేషన్లలో సెక్యూరిటీ, స్కానింగ్, స్ట్రీట్-లెవెల్ మరియు కాన్కోర్స్ ఏరియాల భద్రత నిర్వహించనున్నారు.

రోజుకు సుమారు 5 లక్షల ప్రయాణికులు మెట్రోలో ప్రయాణిస్తుండగా, అందులో 30% మహిళలు ఉన్నారు. మహిళల భద్రత, సౌకర్యం దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ట్రాన్స్‌జెండర్ సిబ్బంది నియామకం:

  • సమాజంలో వారికి ఆత్మగౌరవం పెంచడంతోపాటు,
  • ఉద్యోగావకాశాల ద్వారా ఆర్థిక స్వావలంబన కల్పించడం లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.

ఈ చర్య రాష్ట్రంలో సామాజిక సమానత్వానికి, ఇన్‌క్లూజన్‌కు నిదర్శనంగా పలువురు ప్రశంసిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *