ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్ దాటుతుండగా ఓ యువకుడిని రైలు ఢీకొట్టి చంపేసిన సంఘటన గ్రేటర్ నోయిడా పరిధిలోని దాద్రి ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తుషార్ అనే యువకుడు తన బైక్‌పై రైల్వే ట్రాక్ దాటేందుకు ప్రయత్నించాడు. అయితే రైల్వే గేట్ మూసివేసి ఉన్నప్పటికీ అతను నిర్లక్ష్యంగా దానిని దాటే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బైక్ అదుపు తప్పి పడిపోవడంతో దాన్ని లేపేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో రైలు దగ్గరకు వస్తుండటాన్ని గమనించి తుషార్ పరుగెత్తాడు కానీ పక్కకు కాకుండా ట్రాక్ మీద పరిగెత్తడంతో రైలు అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తుషార్ అక్కడికక్కడే మృతి చెందాడు.
వీడియో చూసిన వారందరూ షాక్ అయ్యారు. ప్రాణం క్షణాల్లో పోతుందని, రైల్వే ట్రాక్ దాటేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.
తాజాగా విడుదలైన జాతీయ నేర రికార్డుల బ్యూరో (NCRB) నివేదిక ప్రకారం, 2023లో దేశవ్యాప్తంగా నమోదైన 2,483 రైల్వే ప్రమాదాల్లో ఉత్తరప్రదేశ్‌లోనే 1,025 కేసులు నమోదయ్యాయి. రైల్వే క్రాసింగ్ ప్రమాదాల్లో మరణాల పరంగా కూడా ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది — దేశంలో నమోదైన 2,242 మరణాల్లో 1,007 మరణాలు యూపీలోనే చోటు చేసుకున్నాయి.
ఈ ప్రమాదాలు రైల్వే ట్రాక్ల వద్ద ప్రజలు పాటించాల్సిన భద్రతా చర్యలపై తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయి.
ఫర్ మోర్ అప్డేట్స్ – కీప్ వాచింగ్ ఓకే టీవీ.

