వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 34వ వార్డులో బీజేపీ అభ్యర్థిగా మేడం లక్ష్మి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వెంకటేశ్వర కాలనీలో జరిగిన ప్రచార కార్యక్రమంలో ఆమె “భరత్ మాతాకి జై”, “జై శ్రీరామ్” నినాదాలతో కాలనీవాసులను ఉద్దేశించి మాట్లాడారు.
తాను బీజేపీ తరపున 34వ వార్డుకు పోటీ చేస్తున్నానని, ప్రజల ఆశీర్వాదంతో గెలిచి అభివృద్ధి చేసి చూపిస్తానని మేడం లక్ష్మి తెలిపారు. ఆడబిడ్డగా మీ ముందుకు వచ్చానని, ఓటు వేసి గెలిపించాలని కాలనీవాసులను కోరారు.
ఈ సందర్భంగా మాట్లాడిన బీజేపీ నాయకులు, మేడం లక్ష్మి రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నందున, అభివృద్ధికి అవసరమైన నిధులను ఢిల్లీ నుంచి నేరుగా గల్లీ వరకు తీసుకురావడానికి అవకాశం ఉంటుందని చెప్పారు.
వికారాబాద్ పట్టణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ నిధులు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు సమర్థంగా వినియోగించాలంటే బీజేపీకి ఓటు వేయాలని వారు పిలుపునిచ్చారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి మేడం లక్ష్మిని భారీ మెజారిటీతో గెలిపించాలని కాలనీవాసులను కోరారు.

