మాదారంలో పోలింగ్ వేళ కాంగ్రెస్ దౌర్జన్యం – బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి రాములుపై దాడి, హైదరాబాద్‌కు రిఫర్
ఈరోజు మాదారం గ్రామంలో జరిగిన పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాములు పోలింగ్ బూత్‌కు వెళ్లిన సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలింగ్ సమయంలో ఏజెంట్‌పై దాడి చేయాలనే ఉద్దేశంతో కొందరు లోపలికి వెళ్లారని తెలిసి, పరిస్థితి ఏంటని అడగడానికి అభ్యర్థి రాములు అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో ఓడిపోతామనే భయంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు వ్యక్తులు…

