రాహుల్ బంధు కాదు… రైతు బంధు కావాలి”: బడ్జెట్ సమావేశాల ముందు బీఆర్ఎస్ ఆందోళన
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. “రాహుల్ బంధు కాదు… రైతు బంధు కావాలి” అంటూ నినాదాలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం బీఆర్ఎస్ శాసనసభా పక్షం ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైందని…

