బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి.. బడ్జెట్‌లో 50 వేల కోట్లు కేటాయించాలి: బీసీ పొలిటికల్ ఫ్రంట్
బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బీసీల సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించాలని కోరుతూ బీసీ పొలిటికల్ ఫ్రంట్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ Balkoni Balaraju Goud హాజరయ్యారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, సామాజిక వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు. దేశంలో సుమారు 140 కోట్ల జనాభాలో 80 కోట్ల మంది…

