బీసీ రిజర్వేషన్ వివాదం: “42% చట్టబద్ధంగా వచ్చే వరకు ఎలక్షన్లు వద్దు” — బీఆర్ఎస్ నేతల హెచ్చరిక
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ బీసీ రిజర్వేషన్ అంశం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ నేతలు స్పష్టంగా ప్రకటించారు — “42% రిజర్వేషన్ చట్టబద్ధంగా, తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చిన తర్వాత మాత్రమే ఎన్నికలకు వెళ్లాలి” అని. లేని పక్షంలో ఎలక్షన్లు జరపడం ప్రజలతో మోసమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. “కులగణన, కమిటీ రిపోర్ట్, జీఓ లు అన్నీ తప్పుగా జరిగాయి; ముఖ్యమంత్రి ఫోటోలు ప్రొఫార్మాలో పెట్టడం చట్ట విరుద్ధం”…

