బీసీ రిజర్వేషన్ వివాదం: “42% చట్టబద్ధంగా వచ్చే వరకు ఎలక్షన్లు వద్దు” — బీఆర్ఎస్ నేతల హెచ్చరిక

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ బీసీ రిజర్వేషన్ అంశం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ నేతలు స్పష్టంగా ప్రకటించారు — “42% రిజర్వేషన్ చట్టబద్ధంగా, తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చిన తర్వాత మాత్రమే ఎన్నికలకు వెళ్లాలి” అని. లేని పక్షంలో ఎలక్షన్లు జరపడం ప్రజలతో మోసమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వారు ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. “కులగణన, కమిటీ రిపోర్ట్, జీఓ లు అన్నీ తప్పుగా జరిగాయి; ముఖ్యమంత్రి ఫోటోలు ప్రొఫార్మాలో పెట్టడం చట్ట విరుద్ధం” అని పేర్కొన్నారు. భూసాని వెంకటేశం కమిటీ రిపోర్ట్‌ ఇంకా పబ్లిక్ డొమైన్‌లో ఉంచలేదని, అసెంబ్లీలో సరైన చర్చ లేకుండానే తీర్మానాలు పంపారని వారు ఆరోపించారు.

బీఆర్ఎస్ నేతలు మరోసారి గుర్తు చేశారు:

“కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు 42% రిజర్వేషన్‌తో పాటు లక్ష కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పింది. కానీ ఇప్పటివరకు ఒక్క హామీ కూడా అమలు కాలేదు.”

అదే సమయంలో బీఆర్ఎస్ నాయకత్వం రాష్ట్రవ్యాప్తంగా బంద్ పిలుపునిచ్చింది.
ఆర్టీసీ, ప్రైవేట్ విద్యాసంస్థలు, వ్యాపార దుకాణాలు, మెట్రో సిబ్బంది, షాప్ ఎస్టాబ్లిష్మెంట్‌లు — అందరూ బంద్‌లో పాల్గొని బీసీ హక్కుల కోసం ఏకతాటిపై రావాలని పిలుపునిచ్చారు.

వారు చెప్పారు:

“మేము అడకతినే వారు కాదు, పోరాడి సాధించేవారు. భయపడే అవసరం లేదు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది చట్టబద్ధంగా 42% రిజర్వేషన్ తర్వాతే ఉండాలి.”

తద్వారా బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు కార్యాచరణను జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత చర్చించనుందని, ఈ ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా బీసీ సమాజం మద్దతుతో కొనసాగుతుందని వారు వెల్లడించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *