జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అజారుద్దీన్ కి మంత్రి పదవి చర్చ – కాంగ్రెస్ వ్యూహం మైనారిటీ ఓట్లపై ఫోకస్
జూబ్లీహిల్స్ ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాజకీయాల్లో వేడి చెలరేగింది. ఈసారి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా మైనారిటీ ఓట్లను ఆకర్షించేందుకు వ్యూహాత్మకంగా పనిచేస్తోంది. ఈ క్రమంలో మాజీ క్రికెటర్, కాంగ్రెస్ సీనియర్ నేత మొహమ్మద్ అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వబోతున్నారనే వార్తలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ముందుగా అజారుద్దీన్ ను ఎమ్మెల్సీగా నియమించి, అనంతరం మంత్రివర్గంలో చేర్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నిర్ణయం ద్వారా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని మైనారిటీ…

