చాలా రోజుల తర్వాత బయటికి వచ్చిన కేసీఆర్: జలాలపై పోరు, కాంగ్రెస్ పాలనపై ఘాటు విమర్శలు, బిఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్
చాలా రోజుల తర్వాత బయటికి వచ్చిన కేసీఆర్: జలాలపై పోరు, కాంగ్రెస్ పాలనపై ఘాటు విమర్శలు, బిఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్ చాలా నెలల విరామం తర్వాత మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. నిన్న బిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వచ్చి శాసనసభాపక్ష సమావేశం (ఎల్పీ మీటింగ్)లో పాల్గొన్న ఆయన, పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు. ముఖ్యంగా తెలంగాణ జలాల అంశం, బనకచెర్ల ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు నీళ్ల…

