స్పీకర్ తీర్పు రాజ్యాంగానికి గొడ్డలి : రేవంత్ పాలన చేతకాకే మురికి ప్రచారం – కేటీఆర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన పూర్తిగా విఫలమైందని, అందుకే మురికి భాషతో విషప్రచారానికి దిగుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. బుధవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ వరుసగా తిరస్కరిస్తున్న తీరు రాజ్యాంగానికే సవాల్‌గా మారిందని కేటీఆర్ అన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి స్వయంగా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కు కండువా కప్పి కాంగ్రెస్‌లో చేర్చుకున్న ఫోటోలు, వీడియోలు ప్రజల కళ్ల…

