కాంగ్రెస్ ఎంపీల మౌనం… విపక్షాలకు కౌంటర్‌లో వైఫల్యంమంత్రివర్గ విస్తరణలో 11 మంది ఎంపీల పేర్లపై చర్చ
తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీల పనితీరుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వడంలో రాష్ట్రం నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీలు విఫలమవుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం 11 మంది ఎంపీల్లో చామల మల్లు మాత్రమే కొంతవరకు యాక్టివ్‌గా కనిపిస్తున్నారని, మిగతావారి పాత్ర అంతంత మాత్రంగానే ఉందనే టాక్ వినిపిస్తోంది. రఘువీర్ రెడ్డి, గడ్డం వంశీ, కడియం కావ్య, అనిల్ కుమార్ వంటి ఎంపీల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి….

