చిత్రపురి అవినీతి బట్టబయలు : “దండుపాలెం బ్యాచ్” బీభత్సం – న్యాయం కోరుతూ సినీ కార్మికుల కేక!
తెలంగాణలోని చిత్రపురి లేఅవుట్‌పై భారీ అవినీతి ఆరోపణలు గత కొంతకాలంగా మళ్లీ తెరపైకి వచ్చాయి. నిజమైన సినిమా కార్మికులకు కట్టాల్సిన ఇళ్లను, లేఅవుట్‌ను కొందరు తిరగరాసి కోట్ల రూపాయల అక్రమాలు జరిపారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్మిక నేత కస్తూరి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులను, ఎదుర్కొంటున్న వేధింపులను మీడియా ముందు బహిర్గతం చేశారు. “ఆధారాలు ఇచ్చినందుకే మా ఇల్లే తీసేశారు” – కస్తూరి శ్రీనివాస్ సాక్ష్యాలతో, లేఅవుట్ పత్రాలతో అవినీతిని బయటపెట్టినందుకు తాను రిజిస్టర్…

