రామగుండం సోలార్–సింగరేణి టెండర్లలో 540 కోట్ల కుంభకోణం?: కాంగ్రెస్ పెద్దలపై పేలుతున్న బొగ్గు స్కామ్ ఆరోపణలు
తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ కుంభకోణం వెలుగులోకి వస్తోందా? రామగుండంలోని 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌తో పాటు సింగరేణి టెండర్లలో సుమారు ₹540 కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నాయి. ఈ స్కామ్ వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బామర్ది పాత్ర ఉందన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఈ అంశంపై తీవ్ర విమర్శలు చేశారు. మూడు వేరు వేరు సైట్లలో…

