కామారెడ్డి డిక్లరేషన్‌పై ఆగ్రహం: 42% రిజర్వేషన్ల కోసం గన్‌పార్క్‌లో బీసీల భారీ ధర్నా
హైదరాబాద్‌లోని గన్ పార్క్ వద్ద బీసీ సంఘాలు, బీసీ నాయకుల ఆధ్వర్యంలో భారీ స్థాయిలో నిరసనలు కొనసాగుతున్నాయి. కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ హామీ చేసిన 42% రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడంతో అసంతృప్తి వెల్లువెత్తింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం 23% రిజర్వేషన్లకే పరిమితం చేయాలని చూస్తోందనే సమాచారం నేపథ్యంలో బీసీ సంఘాలు ఉద్యమానికి శ్రీకారం చుట్టాయి. “పార్టీ పరంగా కాదు, చట్టపరంగా 42% రిజర్వేషన్ కావాలి. అదే అమలు చేయకపోతే…

