సర్పంచ్ ఎన్నికల ఫలితాలే సంకేతం: ఎంపిటీసీ–జెడ్పిటీసీ ఎన్నికలకు కాంగ్రెస్ వెనకడుగు?
ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపుగా మారుతున్నాయి. ముఖ్యంగా పార్టీ గుర్తు లేకుండా జరిగిన ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్‌కు వచ్చిన ఫలితాలు, రాబోయే ఎంపిటీసీ–జెడ్పిటీసీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సభల్లో మాట్లాడుతున్న బిఆర్ఎస్ నేతలు, కార్యకర్తల మాటల్లో స్పష్టంగా కనిపిస్తున్నది ఒక్కటే—సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు యాదృచ్ఛికం కాదు. “కారు గుర్తు లేకపోయినా గుబ గుయ్యి అనిపించింది. రేపు కారు గుర్తుతో ఎన్నికలు…

