అతివృష్టితో పంట నష్టం: ప్రభుత్వ స్పందన కోరుతున్న రైతు సంఘాలు
తెలంగాణలో అతివృష్టి కారణంగా వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింది. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, వికారాబాద్ వంటి జిల్లాల్లో భారీ వర్షాల ప్రభావంతో పంటలు పెద్ద ఎత్తున నష్టపోయాయి. వరి, మక్కజొన్న, పత్తి సహా అనేక పంటలు కోత దశలో ఉండగానే వర్షాల వలన తడిసి మొలకలు రావడం, పాడైపోవడం, ఫంగస్ పట్టడం వంటి పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు, రైల్వే మార్గాలు దెబ్బతిన్నాయి. గ్రామాల్లో ఇళ్లలోకి నీరు రావడంతో గృహోపకరణాలు కూడా నష్టపోయాయని…

