ఉద్యోగులే ప్రభుత్వ రథచక్రాలు… డీఏలు, పీఆర్సీ, ఓపీఎస్ అమలు చేయాలి: అసెంబ్లీలో గళమెత్తిన సభ్యుడు
తెలంగాణ శాసనసభ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, పోలీసుల సమస్యలపై సభ్యుడు తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి రథచక్రాలంటూ, వారు సంతోషంగా ఉంటేనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు సజావుగా చేరుతాయని స్పష్టం చేశారు. అయితే నేడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రమైన మనోవేదన, ఆవేదనలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినా ఇప్పటివరకు…

