తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ త్వరలోనే? – డెడికేషన్ కమిషన్ నివేదిక నేడు అందజేయనుంది
తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. ఈ నెల 26వ తేదీన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టుగా ప్రభుత్వ వర్గాల నుంచి సంకేతాలు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో బీసీలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్ విచారణ ఈ నెల 24న జరగనుంది. కోర్టు తీర్పు అనంతరం రెండు రోజుల వ్యవధిలో ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది….

