నేషనల్ హెరాల్డ్ కేస్: ఈడీ నోటీసులతో కాంగ్రెస్‌ను భయపెట్టలేరు – బీజేపీపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు
నేషనల్ హెరాల్డ్ కేస్ నేపథ్యంలో కాంగ్రెస్ – బీజేపీ మధ్య రాజకీయ ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమంపై స్పందిస్తూ, ఇది ఇక్కడితో ఆగేది కాదని, ముందు ముందు పోరాటం మరింత ఉధృతమవుతుందని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా మార్చుకుని ప్రతిపక్ష నాయకులను బెదిరిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని దేశం మొత్తం…

