ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ మోసం: హైదరాబాద్ యువకుడిని 14.34 లక్షలు గుంజిన నెట్వర్క్
హైదరాబాద్‌లో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్ ట్రేడింగ్ చేస్తే అధిక లాభాలు వస్తాయని నమ్మించి సైబర్ నేరగాళ్లు నగరానికి చెందిన 27 ఏళ్ల వ్యక్తిని రూ. 14.34 లక్షలు దోచుకున్నారు. కాచిగూడకు చెందిన యువకుడిని మొదట WhatsApp ద్వారా సంప్రదించిన నేరగాళ్లు, తాము “పైరసీ DMA ట్రేడింగ్ ప్రతినిధులు” అని చెప్పుకున్నారు. బాధితుడిని ప్రత్యేక గ్రూపులో చేర్చి పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించారు. వారి నమ్మకాన్ని పొందేందుకు యాప్‌లో లాభాలు వచ్చినట్లుగా…

