13 ఏళ్ల తర్వాత కూడా తగ్గని జోరు: హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫస్ట్ సింగిల్‌తో ఫ్యాన్స్‌కు పండగ
ఒక రాయి అందమైన శిల్పంగా మారాలంటే సరైన శిల్పి చేతిలో పడాలి… అలాగే ఒక నటుడు సూపర్ స్టార్‌గా ఎదగాలంటే సరైన దర్శకుడి కాంబినేషన్ కుదరాలి. అలాంటి మ్యాజికల్ కాంబినేషన్లు తెరపైకి వచ్చినప్పుడే బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలవుతాయి. అలాంటి అరుదైన సూపర్ హిట్ కాంబినేషన్లలో ఒకటి హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్. 2012లో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా అప్పటి తెలుగు సినిమా ఇండస్ట్రీనే కాదు, బాక్సాఫీస్ ట్రెండ్‌ను పూర్తిగా మార్చేసింది….

