ప్రజాసేవే లక్ష్యం… వరంగల్ వరద నష్టాలు, కృష్ణానగర్ సమస్యలపై అసెంబ్లీలో తొలి ప్రసంగం
తెలంగాణ శాసనసభ వేదికగా తొలి ప్రసంగం చేసిన సభ్యుడు భావోద్వేగంగా మాట్లాడారు. మంత్రులు, సభ్యులు, అధికారులందరికీ నమస్కారం తెలియజేస్తూ, స్పీకర్‌కు ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఇదే సభలో గౌరవ ముఖ్యమంత్రి తన పేరును ప్రస్తావించిన సందర్భాన్ని గుర్తు చేస్తూ, రెండేళ్ల లోపే శాసనసభ సభ్యుడిగా ఈ సభలో అడుగుపెట్టడం తనకు గొప్ప గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనకు ప్రజాసేవ చేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ పెద్దలు, అలాగే తనను…

