ఆర్మూరు ప్రజలకు నిధులు ఇస్తారా? లేక మీ కొడంగల్‌కే పరిమితమా?
ఎన్నికల ముందు ఆర్మూరును గెలవాలనే ఉద్దేశంతో ఎన్నో హామీలు ఇచ్చారు.ఈ రోజు ప్రశ్న ఒక్కటే — ఆ హామీలు నెరవేరాయా?నిధులు వచ్చాయా?లేదా ఇప్పుడు మళ్లీ మున్సిపల్ ఎన్నికల్లో కొత్త మాటలతో ప్రచారం చేస్తున్నారా? ఆర్మూరు ప్రజలకు నేను ముందుగా ఇచ్చింది భయంలేని జీవితం.ఒకప్పుడు అక్కడ భయానక వాతావరణం ఉండేది.దాడులు, అక్రమ కేసులు, దళితులపై అణచివేత, మహిళలపై దురాగతాలు —ప్రజలు స్వేచ్ఛ అంటే ఏమిటో కూడా మరిచిపోయిన పరిస్థితి. ఈ రోజు ఆర్మూరు ప్రశాంతంగా ఉంది.భయం లేదు, బానిసత్వం…

