తండ్రి జ్ఞాపకాలతో భావోద్వేగానికి గురైన మహేశ్ బాబు – రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్ ముందు ఎమోషనల్ పోస్ట్
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈరోజు తన తండ్రి, దివంగత నటుడు ఘట్టమనేని కృష్ణను తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు. తన కెరీర్‌లోనే అత్యంత పెద్ద ప్రాజెక్ట్‌గా నిలుస్తోన్న, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి సంబంధించిన వినూత్న ఈవెంట్ ‘గ్లోబ్‌ట్రాటర్’ ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. ఈ విశేష సందర్భంలో తన తండ్రి లేని ఖాళీ మరింతగా అనిపించిందని మహేశ్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించారు. తండ్రితో దిగిన పాత ఫొటోను పంచుకుంటూ,…

