మధ్యాహ్న భోజనంలో ఘోర నిర్లక్ష్యం: సంగారెడ్డి ఘటనపై హెచ్ఆర్సీ సీరియస్, జిల్లా కలెక్టర్‌కు నోటీసులు
సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలం వెంకటాపూర్ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకున్న ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (HRC) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాఠశాలలో అందించిన మధ్యాహ్న భోజనం తిన్న అనంతరం 22 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడంను కమిషన్ సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ ఘటనకు సంబంధించి “వికటించిన మధ్యాహ్న భోజనం – 22 మంది విద్యార్థులు అస్వస్థ” అనే శీర్షికతో దినపత్రికల్లో ప్రచురితమైన కథనాలపై హెచ్ఆర్సీ జుడిషియల్ సభ్యులు…

